Telugu Gateway
Cinema

పవన్ కళ్యాణ్ సినిమాలో రానా

పవన్ కళ్యాణ్ సినిమాలో రానా
X

టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విలక్షణ హీరో దగ్గుబాటి రానా కాంబినేషన్ సెట్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ లో తెరకెక్కించే సినిమాలో వీరిద్దరూ కలసి నటిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. రానాను ఈ సినిమాలో కీలక పాత్రకు ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. దగ్గుబాటి రానా కూడా దీనిపై ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. 'మరో ప్రయాణం ప్రారంభం అయింది. ఇప్పటి వరకూ పలు పరిశ్రమలకు చెందిన వారితో కలసి పనిచేశాను . ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నటించే ప్రాజెక్టుకు సంబంధించి సెట్స్ లో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను' అని పేర్కొన్నారు.

Next Story
Share it