Telugu Gateway
Cinema

అబ్బాయికి బాబాయ్ అభినందనలు

అబ్బాయికి బాబాయ్ అభినందనలు
X

ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో దుమ్ము రేపుతోంది. మెగా హీరో రాంచరణ్ గత కొన్ని రోజులుగా అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దర్శకుడు రాజమౌళి తో పాటు కీరవాణి ఇతర టీం కూడా అక్కడే ఉంది. తాజాగా ఆర్ఆర్ఆర్ కు నాలుగు హెచ్ సిఏ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్.ఆర్.ఆర్' పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం అన్నారు. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది.

రామ్ చరణ్ కి , దర్శకులు రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్‌ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చ్ 12 న ప్రకటించే ఆస్కార్ అవార్డుల్లో ఖచ్ఛితంగా ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కుతుంది అని చిత్ర ఉంది విశ్వాసంతో ఉంది.

Next Story
Share it