Telugu Gateway
Cinema

ఐదు సార్లు పఠాన్ చూశా..కోటి రూపాయలు ప్లీజ్

ఐదు సార్లు పఠాన్ చూశా..కోటి రూపాయలు ప్లీజ్
X

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా బాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించింది. భారత్ లో ఇప్పటివరకు ఒక్క దంగల్ సినిమా 387 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో టాప్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డు ను పఠాన్ బ్రేక్ చేసి దేశంలో 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఈ మూవీ రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు అమీర్ ఖాన్ దంగల్ పేరుతో ఉన్న రికార్డు ను పఠాన్ తిరగరాసినట్లు అయింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సినిమా విడుదలకు ముందు దీనిపై పెద్ద వివాదం చెలరేగినా కూడా...సినిమా విజయంలో ఇవేమి ప్రభావం చూపించలేక పోయిందనే చెప్పొచ్చు.

ఇది ఇలా ఉంటే పఠాన్ హీరో షారుఖ్ ఖాన్ ను ఒక అభిమాని వింత కోరిక కోరాడు. దీనిపై ఆ హీరో కూడా అలాగే స్పందించాడు. తాను పఠాన్ సినిమా ఐదు సార్లు చూశానని..తనకు సినిమా వసూళ్ళలో ఒక కోటి రూపాయలు ఇవ్వాలంటూ కోరాడు. దీనిపై సరదాగా స్పందించిన షారుఖ్ ఖాన్ తమ్ముడూ స్టాక్ మార్కెట్ లో కూడా ఇంత భారీ స్థాయిలో రేట్ అఫ్ రిటర్న్ (ఆర్ఓఆర్) ఉండదు అంటూ స్పందించాడు. మరి కొన్ని సార్లు సినిమా చూడు..దార్వాత చూద్దాం తర్వాత అంటూ కోటి అడిగిన అభిమానికి రిప్లై ఇచ్చాడు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన పఠాన్ సినిమాల్లో షారుఖ్ ఖాన్ తో పాటు దీపికా పదుకొనె, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషించారు.

Next Story
Share it