Telugu Gateway
Cinema

కొత్త తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్

కొత్త తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్
X

దసరా లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత హీరో నాని..దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ది ప్యారడైజ్. ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ కు వెళ్లాయి. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ సినిమా 2026 మార్చి 26 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దీనికి అనుగుణంగా చిత్ర యూనిట్ గురువారం నాడు అధికారికంగా ఈ విషయం చెప్పేసింది. ది ప్యారడైజ్ మూవీ ఆగస్ట్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు. హడావుడిగా సినిమాను విడుదల చేయాలనుకోవడం లేదు అని...దీనికి కొంత సమయం కావాలి అంటూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. రెండు జడలతో విడుదల తేదీతో కూడిన న్యూ లుక్ ను షేర్ చేశారు. ఈ సినిమాలో హీరో నాని గతంలో ఎన్నడూ లేని రీతిలో మరీ రఫ్ గా కనిపిస్తున్నాడు. నాని కి జోడిగా ఈ మూవీ లో సోనాలి కులకర్ణి, కయాదు లోహర్ లు నటిస్తున్నారు. మోహన్ బాబు తో పాటు సంపూర్ణేష్ బాబు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Next Story
Share it