Telugu Gateway
Cinema

నాగ్ అశ్విన్ బిగ్ స్కెచ్

నాగ్ అశ్విన్ బిగ్ స్కెచ్
X

ప్రస్తుతం ప్రభాస్ సీజన్ నడుస్తోంది. గత నెలలో వచ్చిన ఆదిపురుష్ కొంత నిరాశపరిచినా ఇప్పుడు ఆయన ఫాన్స్ అందరూ సలార్, ప్రాజెక్ట్ కె లపైనే ఫోకస్ పెట్టారు. తాజాగా విడుదల అయిన సలార్ టీజర్ లో ప్రభాస్ పేస్ కనిపించకపోయినా ఇది యూట్యూబ్ లో రికార్డు లు నమోదు చేసుకుంటూ పోతోంది. ఈ తరుణంలో ప్రాజెక్ట్ కె సినిమా నుంచి మరో సంచలన అప్ డేట్ వచ్చింది. అమెరికా లో ప్రతిష్టాత్మకంగా జరిగే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా యూనిట్ పాల్గొంటోంది. భారత్ నుంచి ఈ ఈవెంట్ లో పాల్గొనే తొలి మూవీ గా ప్రాజెక్ట్ కె నిలవనుంది. ఈ సినిమాను హాలీవుడ్ మార్కెట్ లోకి తీసుకెళ్లాలి అనే టార్గెట్ గానే చిత్ర యూనిట్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సరిగ్గా మార్కెట్ చేసుకుంటే ప్రాజెక్ట్ కె తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ సినిమా వసూళ్లు కూడా ఏ భారతీయ సినిమా కు రానంతగా వచ్చే అవకాశం ఉంది చెప్పారు.

తాను కొన్ని సినిమా సెట్స్ చూసిన తర్వాత ఈ మాటలు చెపుతూన్నట్లు వెల్లడించారు అయన. ఇప్పుడు సినిమా యూనిట్ ప్లాన్ చూస్తుంటే కూడా పెద్ద స్కెచ్ ఉన్నట్లే కనిపిస్తోంది. కామిక్ కాన్ ఈవెంట్ అంతర్జాతీయంగా సినిమాలను ప్రమోట్ చేసుకునే ఒక వేదిక. జులై 20 నుంచి 23 వరకు జరిగే ఈ ఈవెంట్ లో తొలి రోజు హీరో ప్రభాస్ తో పాటు హీరోయిన్ దీపికా పాడుకొనే, కమల్ హాసన్, చిత్ర నిర్మాత, దర్శకులు పాల్గొనబోతున్నారు. అక్కడే ఈ సినిమా టైటిల్, ట్రైలర్, విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. భారత్ ఎన్నో గొప్ప కథలకు నిలయం అని..ప్రాజెక్ట్ కె ఈ విషయాన్నీ ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రపంచ ప్రేక్షకులకు ఈ సినిమా ను పరిచయం చేయటానికి ఇదే సరైన వేదిక అని భావించాం అని తెలిపారు. దీంతో ఈ సినిమాను అక్కడ కూడా విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it