Telugu Gateway
Cinema

వెరైటీ టైటిల్ తో గోపీచంద్ సినిమా

వెరైటీ టైటిల్ తో గోపీచంద్ సినిమా
X

మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న గోపీచంద్ సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది. మార్చి 5 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది.

అంతే కాదు..టైటిల్ ప్రకటన రోజే విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Next Story
Share it