గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. హీరోయిన్ రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రాశీఖన్నా దివి నుంచి భువికి దిగి వస్తున్న దేవకన్యలా చూపించారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ ప్రజంట్ చేస్తుండగా యూవీక్రియేషన్స్ నిర్మాణ బాగస్వామిగా ఉంది.