Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న తేజ సజ్జా

దుమ్మురేపుతున్న  తేజ సజ్జా
X

తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా మిరాయి. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. మిరాయి సినిమాలో మంచు మనోజ్ కూడా కీలక పాత్ర పోషించారు. అయన పాత్రకు కూడా ప్రేక్షుకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. మిరాయి సినిమా కు పాజిటివ్ టాక్ రావటంతో ఈ సినిమా కు శనివారం, సండే బుకింగ్స్ కూడా ఫుల్ గా కనిపిస్తున్నాయి. మరో వైపు చిత్ర యూనిట్ ఈ మూవీ కి ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 27 .20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ జోష్ చూస్తుంటే మిరాయి మొదటి వారంలోనే వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరటం ఖాయం అనే అంచనాలు వెలువడుతున్నాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కు ప్రేక్షకుల ఫిదా అయ్యారు అనే చెప్పాలి. ఎప్పుడైతే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు బయటకు వచ్చాయో అప్పటి నుంచే మిరాయి సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి. పెరిగిన అంచనాలను ఈ సినిమా అందుకోవటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే తేజ సజ్జా సూపర్ హిట్ మూవీ హను మాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో మెరుగ్గా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. ఈ లెక్కన మిరాయి రాబోయే రోజుల్లో కొత్త కొత్త రికార్డు లు నమోదు చేయటం ఖాయం అని చెపుతున్నారు.

Next Story
Share it