కీలక మార్పులతో ఓటిటి లోకి

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు సినిమా ఓటిటి లోకి వచ్చేసింది. పలు అవాంతరాలు అధిగమించి ఈ మూవీ జులై 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ డే తప్ప ..తర్వాత పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. వాస్తవానికి ఈ సినిమా బాగానే ఉన్నా కూడా దీనిపై జరిగిన నెగిటివ్ ప్రచారం ఈ మూవీ కలెక్షన్స్ ను దెబ్బతీశాయని అనే చెప్పాలి. తొలుత ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ మొదలు పెట్టగా..తర్వాత ఆయన పక్కకు తప్పుకోవడంతో నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా బాధ్యతలు తీసుకుని పెండింగ్ మూవీ ని పూర్తి చేశారు.
ఇప్పుడు హరి హర వీర మల్లు మూవీ ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్ట్ 20 నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటిటి వెర్షన్ లో కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రతికూలంగా మారిన క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కొన్ని వీఎఫ్ఎక్స్ సీన్ లు కూడా తొలగించి ఓటిటి లోకి అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. హర హర వీర మల్లు సినిమా లో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించింది.



