ఆస్కార్ తో పెరగనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ బ్రాండ్ వేల్యూ!

రాంచరణ్ ప్రస్తుతం తన 15 వ సినిమా చేస్తున్నారు. ఒకరు ముప్పయ్యవ సినిమాకు, మరొకరు 15 వ సినిమాకే తాము కీలక భూమిక పోషించిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కించుకోవటం మామూలు విషయం ఏమీ కాదు. ఇది అంతా దర్శకుడు రాజమౌళి కృషి అయినా ఈ ఇద్దరు హీరో లు డాన్స్ లో ఇరగదీస్తారు అనే విషయం తెలిసిందే. నాటు నటుడు పాటు ఆస్కార్ రావటం తో ఇద్దరు హీరో ల బ్రాండ్ వేల్యూ పెరగటం తో పాటు వాళ్ళిద్దరిపై ఒత్తిడి కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అటు ఎన్టీఆర్, ఇటు రాంచరణ్ లు ఇప్పటికే ఇటు సినిమా ల తో పాటు పలు బ్రాండ్స్ కు అంబాసిడర్స్ గా కూడా వ్యవరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అని...భారీ మొత్తంలో చెల్లించి మరి వీళ్ళిద్దరితో ఒప్పందాలు చేసుకుంటారు అని చెపుతున్నారు.