Telugu Gateway
Cinema

వెరైటీగా 'ఒకే ఒక జీవితం' టీజ‌ర్

వెరైటీగా  ఒకే ఒక జీవితం టీజ‌ర్
X

ర్వానంద్, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాలో అమ‌ల‌, నాజ‌ర్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శిలు కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల అయింది. ఈ టీజ‌ర్ ను కోలీవుడ్ హీరో సూర్య విడుద‌ల చేసి.చిత్ర యూనిట్ కు త‌న విషెస్ తెలిపారు. 'ఇప్పుడు నేను చెప్ప‌బోయే విష‌యానికి మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు.

అస‌లు న‌మ్మ‌క‌పోవ‌చ్చు కూడా. కానీ మీరు ఇది న‌మ్మే తీరాలి.' అంటూ నాజ‌ర్ చెప్పే డైలాగ్ తో టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. ఇది ఒక టైమ్ మెషీన్ ..దీంట్లో ఒక్క‌సారి మాత్ర‌మే ప్ర‌యాణించ‌గ‌లం. మీరు భ‌విష్య‌త్ నుంచి వ‌చ్చార‌ని ఎవ‌రికీ అనుమానం రాకూడ‌దు అంటూ నాజ‌ర్ డైలాగ్ లు..కీల‌క పాత్ర‌దారుల స‌న్నివేశాల‌తో అత్యంత ఆస‌క్తిక‌రంగా టీజ‌ర్ సాగింది. టీజ‌ర్ లో చూపించిన కొత్త‌ద‌నం ఈ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింద‌నే చెప్పాలి. కొత్త సంవ‌త్స‌రంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్న‌ట్లు తెలిపారు.

Next Story
Share it