Telugu Gateway
Cinema

పదకొండు రోజులు...308 కోట్లు

పదకొండు రోజులు...308 కోట్లు
X

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీ రికార్డు క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకుంది. విడుదల అయిన పదకొండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 308 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా వెల్లడించింది. 2025 సంవత్సరంలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన తెలుగు సినిమా గా ఓజీ నిలిచింది అని వెల్లడించారు. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే ఏకంగా 154 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లో మొత్తం ఇంత భారీ వసూళ్లు సాధించిన మొదటి మూవీ ఇదే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి సంక్రాంతి కి విడుదల అయిన వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ..ఇప్పుడు పదకొండు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఓజీ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది. రాబోయే రోజుల్లో ఓజీ సినిమా సీక్వెల్, ప్రీక్వెల్ లు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్...దర్శకుడు సుజీత్ లు. అయితే ఇవి ఎప్పుడు మొదలవుతాయి అనే అంశంపై ఇప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు అని చెపుతున్నారు. ఓజీ మూవీ తో పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేయటంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు అనే చెప్పాలి.

Next Story
Share it