డ్రాగన్ స్పెషల్ గ్లింప్స్

సంక్రాంతి రేస్ నుంచి ఎన్టీఆర్ సినిమా తప్పుకుంది. ముందు ప్రకటించిన దాని ప్రకారం అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఈ సినిమా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేసింది. దీని ప్రకారం వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2026 జూన్ 25 న రాబోతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఫాన్స్ కు మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ అందించారు. అదేంటి అంటే ఎన్టీఆర్ పుట్టిన రోజు అయినా మే 20 న ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ విధ్వంసం అయ్యే అనుభూతికి సిద్ధం కండి అంటూ 2026 జూన్ 25 న థియేటర్లు దద్దరిల్లే సౌండ్స్ వింటారు అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. కెజీఎఫ్, సలార్ సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా ఎంతో ఇమేజ్ దక్కించుకున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే అంచనాలు ఒక రేంజ్ కు పెరిగిపోయాయి. ఇది ఎన్టీఆర్ 31 వ సినిమా. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.