Telugu Gateway
Cinema

'అఖండ‌' సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్

అఖండ‌ సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్
X

నందమూరి బాలకృష్ణ న‌టించిన 'అఖండ‌' సినిమాపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు అంద‌రూ దీనిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా క‌రోనా త‌ర్వాత థియేట‌ర్ల‌లో ఈ త‌ర‌హా సంద‌డి చూసిన ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు మాంచి జోష్ వ‌చ్చింద‌నే చెప్పాలి. దీనికి బ‌ల‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వ‌ర‌స పెట్టి పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఈ నెల 17న అల్లు అర్జున్ సినిమా పుష్ప ద రైజ్ విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. నెలాఖ‌రులో శ్యామ్ సింగ‌రాయ్ తోపాటు గ‌ని సినిమాలు ఉన్నాయి. జ‌న‌వ‌రి 7న రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లు న‌టించిన రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో అంద‌రూ అఖండ విజ‌యాన్ని ఆస్వాదిస్తూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ అఖండ సినిమా చూశారు. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదికగా వెల్లడిస్తూ రీసౌండింగ్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న బాలా బాబాయ్ తోపాటు చిత్ర యూనిట్ కు నా అభినంద‌న‌లు. ఆయ‌న అభిమానులు ఎంతో సంతోషించే హార్డ్ కోర్ మూమెంట్స్ ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై హీరో మ‌హేష్ బాబుతోపాటు ప‌లువురు ద‌ర్శ‌కులు కూడా స్పందించిన విష‌యం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ ఈ అఖండ సినిమా అంచ‌నాల‌కు అనుగుణంగా థియేట‌ర్ల‌లో దుమ్మురేపుతోంది.

Next Story
Share it