Telugu Gateway
Cinema

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పై ఒత్తిడి పడనుందా?!

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పై ఒత్తిడి పడనుందా?!
X

ఇద్దరు టాప్ హీరో ల ఫాన్స్ లో ఇప్పుడు ఇదే చర్చ. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయి పది నెలలు కావస్తోంది. . అయినా సరే ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త మీడియాలో నలుగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబదించిన నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు తో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కూడా దక్కింది. అదే సమయంలో ఇదే పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో కూడా ఉంది. జపాన్ లో ఆర్ఆర్ ఆర్ సినిమా విడుదల చేయగా అక్కడ కూడా మంచి స్పందనే వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యాక స్టోరీ తో పాటు సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీ 1000 కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లు సాధించి రికార్డులు నెలకొల్పింది. కమర్షియల్ గా చూస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కింద లెక్క. ఇది అంతా బాగానే ఉన్న పది నెలల తర్వాత కూడా ఇంకా ఆర్ఆర్ఆర్ హైప్ కొనసాగుతుండటం తో ఈ ప్రభావం తమ కొత్త ప్రాజెక్టులపై పడే అవకాశం ఉందనే ఆందోళన ఈ ఇద్దరు హీరోల ఫాన్స్ లో ఉంది. ఎన్టీఆర్ ఫిబ్రవరి నుంచి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కాకపోతే ఈ సినిమా విడుదల మాత్రం 2024 ఏప్రిల్ 5 గా అప్పుడే ప్రకటించారు. మరో హీరో రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమా హడావుడి కొనసాగుతుండటం తో ఇద్దరు హీరోలపై ఒత్తిడి సహజమే అని చెపుతున్నారు. చిరంజీవి లాంటి సీనియర్ హీరో కూడా ఆచార్య సినిమా ఫెయిల్ కావటంతో ఎంత పెద్ద టెన్షన్ కు గురయ్యారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అయినా కూడా ఈ ప్రభావం తదుపరి సినిమాలపై ఉంటుంది అని..ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు హీరోలు తదుపరి ప్రాజెక్టుల్లో ఎవరు విజయతీరాలకు చేరుతారో. సినిమా తీయటం ఒకెత్తు. దాన్ని మార్కెటింగ్ చేయటం మరో ఎత్తు. ఇందులో తలపండిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది టాలీవుడ్ విషయానికి వస్తే వందకు వంద మార్కులు ఎస్ ఎస్ రాజమౌళి కే పడతాయి. సినిమా ప్రకటన నుంచి అయన ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే వరస విజయాలు కూడా ఆయనకు ఈ విషయంలో కలిసొచ్చేలా చేశాయని చెప్పొచ్చు. ఇది అంతా ఎందుకు అంటే అయన తన ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా కూడా పెద్ద మార్కెటింగ్ చేసుకున్నారు. ఇది కచ్చితంగా భవిష్యత్తులో అయన తీయబోయే సినిమాలకు ఉపయోగ పడబోతోంది. అంతే కాదు రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ సినిమాకు కూడా డైరెక్షన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు.

Next Story
Share it