ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ లో ఎన్టీఆర్..రామ్ చరణ్
BY Admin5 Feb 2021 1:49 PM GMT
X
Admin5 Feb 2021 1:49 PM GMT
ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఇటీవల కాలంలో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ జోరు పెంచింది. ఇటీవలే క్లైమాక్స్ స్టార్ట్ అయిన విషయాన్ని తెలిపిన యూనిట్..తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. 300 రూపాయల కోట్ల అంచనా వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.
Next Story