Telugu Gateway
Cinema

టైగర్ తో టైగర్ ఎంట్రీ

టైగర్ తో టైగర్  ఎంట్రీ
X

ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్ కు ఇది ఎంతో స్పెషల్ డే అని చెప్పక తప్పదు. ఈ సినిమాలో అయన కొమరం భీం గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒకసారి అయన పులి తో పోరాడే సన్నివేశం కూడా ఉంటుంది. పులి గాండ్రింపు కు దీటుగా ఎన్టీఆర్ కూడా గర్జిస్తారు సినిమాలో. ఈ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు ల వేడుకలో హుంగామా చేసిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

ముఖ్యంగా అయన టైగర్ లుక్ డ్రెస్ అదరగొట్టింది అని చెప్పొచ్చు. ఈ డ్రెస్ ను తన సన్నిహిత మిత్రుడు అయినా పాపులర్ డిజైనర్ గౌరవ్ గుప్తా సిద్ధం చేశారన్నారు. తాను భారతీయ వస్త్రధారణ తో వచ్చానని...పులి తమ జాతీయ జంతువు అని అందుకే ఈ డ్రెస్ వేసుకున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. కేవలం ఆస్కార్ కార్పెట్ పై నడవటం కాదు...తాము భారత్ తరపున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని అందుకే చర్చించి ఈ డిజైన్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. అమెరికన్ మీడియా ప్రతినిధి కూడా ఎన్టీఆర్ డ్రెస్ ఎంతో ప్రత్యేకంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లురి సీతారామ రాజు పాత్ర పోషించిన రాంచరణ్ డ్రెస్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఆ సినిమాలో అయన పోషింగ్ పోలీస్ పాత్రకు సంబందించిన లోగోలతో ఆ డ్రెస్ ఉంది.

Next Story
Share it