Telugu Gateway
Cinema

కాలభైరవ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ ఫైర్

కాలభైరవ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ ఫైర్
X

ట్వీట్ అయినా...మాట అయినా ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి. ఏ మాత్రం తేడా వచ్చిన సరే అందరూ సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. చిన్న తేడా జరిగినా నిమిషాల వ్యవధిలోనే ఎటాక్ ప్రారంభిస్తున్నారు. దీంతో పొరపాటునో...కావాలనో ట్వీట్ చేసినా వారు మాత్రం దిద్దు బాటు చేసుకోవాల్సి వస్తోంది. లేక పోతే ఆ రచ్చ భరించటం ఎంత కష్టమో దాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు అలాటిందే ఒక సంఘటన జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు అంత ప్రాధాన్యత రావటం వెనక కచ్చితంగా ఎన్టీఆర్, రామ్ చరణ సింక్ తో చేసినా డాన్స్ ను ఎవరు కాదనలేరు. పాటకు ఊపు తెచ్చింది వాళ్లిద్దరే. అదే సమయం లో సింగర్స్ కాల భైరవ, రాహుల్ సింప్లి గంజ్ ను, పాట రాసిన చంద్ర బోస్ ను..కొరియోగ్రఫీ చేసినా ప్రేమ్ రక్షిత్ ను .ఎవరూ తక్కువ చేయరు. తాజాగా ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావటంతో ఇప్పుడు ఇది మరో సారి ట్రెండింగ్ లో నిలిచింది. ఆస్కార్ వేడుకల నుంచి ఆర్ఆర్ఆర్ టీం తిరిగి వచ్చింది. తాజాగా సింగర్ కాల భైరవ ఒక ట్వీట్ చేశారు. అందులోని సారాంశం ఇలా ఉంది. ‘‘మీతో ఓ విషయం పంచుకోవాలని అనుకుంటున్నా. ఆస్కార్స్ స్టేజ్‌పైన ఆర్ఆర్ఆర్ టీమ్‌ని రిప్రజెంట్ చేస్తూ బెస్ట్ ఓరిజినల్ సాంగ్ అయిన ‘నాటు నాటు’ లైవ్ ఫర్ఫామెన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. కొంతమంది వల్లే ఇది సాధ్యమైంది.

నాకు ఈ అవకాశం వచ్చేందుకు కారణమైన రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మకి ధన్యవాదాలు. వారి కష్టం వల్లే ఈ పాట ప్రపంచంలోని నలుమూలలకి చేరింది. వారి వల్లే నాకు ఇలాంటి గొప్ప అవకాశం వచ్చింది’ అని ప్రస్తావించారు. అయితే అందులో ఎక్కడ హీరో లు ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. ఇది ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ కు కాక పుట్టించింది. అంతే వెంటనే సోషల్ మీడియా వేదికగా ఎటాక్ చేశారు. ‘ఆ హీరోలు కనుక మంచిగా డ్యాన్స్ చేయకపోతే.. ఎవరూ ఆ పాటని చూసేవారే కాదు’.. ‘సంగీతంపరంగా కొమ్మ ఊయ్యల, దోస్తి ఈ పాటకంటే బావుంటాయి. కానీ.. డ్యాన్స్ వల్లే ఈ పాట ఆ స్థాయికి చేరింది. అది గుర్తు లేదా’.. ‘హీరోలు లేకపోతే నాటు నాటుకి భాస్కర్ అవార్డు కూడా రాదు’ అని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. దీంతో తారక్‌, చెర్రీ‌కి, వారి ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతూ కాలభైరవ మరో పోస్ట్ చేశాడు. తన ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకున్నారు అని...ఆస్కార్ వేదిక పై లైవ్ పెర్ఫార్మన్స్ గురించి మాత్రమే తాను ఆ ట్వీట్ లో ప్రస్తావించాను తప్ప...ఈ పాట విజయవంతం కావటంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లది ఎంతో కీలక పాత్ర అని కొనియాడారు.

Next Story
Share it