Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కు అచ్చిరాని దేవర ముహూర్తం!

ఎన్టీఆర్ కు అచ్చిరాని దేవర ముహూర్తం!
X

హీరోల పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళ వాళ్ళ కొత్త సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వటం టాలీవుడ్ లో మాములే. ఎన్టీఆర్ 30 వ సినిమా చిత్ర యూనిట్ కూడా అదే పని చేసింది. అయితే హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కు మాత్రం ఈ సారి ముహూర్తం ఏ మాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు ఫస్ట్ లుక్...టైటిల్ ప్రకటించాలని నిర్ణయించారు. చెప్పిన టైం ప్రకారమే వాళ్ళు ఆ పని చేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బీఐ) రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఈ దెబ్బకు ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియా ఫోకస్ అంతా అటు వైపు మళ్లింది. ఎందుకు అంటే ఈ నోటు రద్దు ప్రజల జీవితాలతో ముడి పడి ఉన్న అన్నఅంశం కావటంతో సహజంగా అందరి దృష్టి దానిపైనే పడింది. దీంతో ఆ సమయంలో విడుదల అయిన ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర ఫస్ట్ లుక్ ..టైటిల్ ప్రకటనపై పెద్ద దెబ్బ పడినట్లు అయింది.

ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫాన్స్ తప్ప మిగిలిన వాళ్ళు దీనిపై పెద్దగా దృష్టి సారించే ఛాన్స్ లేకుండా పోయింది. సహజంగా నెట్ లో ఎక్కువ మందిని ఆకర్షించేవి సినిమా అప్ డేట్స్ అన్న విషయం తెలిసిందే. అందులో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ సినిమా అప్ డేట్స్ అంటే ఫాన్స్ తో పాటు ఇతర సినీ అభిమానులు కూడా ఆసక్తి చూపుతారు. కానీ ఈ సారి ఎన్టీఆర్ కు ముహూర్తం కలిసి రాలేదు అని..దేవరపై రెండు వేల రూపాయల దెబ్బ పడింది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిసొంది. ఈ ఫస్ట్ లుక్ పై చిత్ర యూనిట్ రెండు రోజుల ముందు నుంచి అంచనాలు పెంచుకుంటూ పోయింది. కానీ అనుకోని రీతిలో ఆర్ బీఐ ప్రకటన రావటంతో దీనిపై దెబ్బ్బ పడింది.


Next Story
Share it