ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎందుకంటే వీళ్లిద్దరి ట్రాక్ రికార్డు అలాంటిది. నటనలో ఎన్టీఆర్ మాస్టర్ అయితే...దర్శకత్వంలో ప్రశాంత్ నీల్ వరస విజయాలతో తనదైన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చి చాలా కాలమే అయింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ గురువారం నాడు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతే కాదు ఒక జీప్ పై నిలబడి దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ చెపుతున్న దృశ్యాన్ని కూడా విడుదల చేసింది.
భారతీయ చలన చిత్ర చరిత్రలో తనదైన ముద్ర వేయటానికి ఈ భూమి స్వాగతం పలికింది అంటూ ఈ ఫోటో ను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో కొత్త కెరటాలు..ప్రేక్షుకులను కట్టిపడేసే యూఫోరియా తో సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న తొలి సినిమా వార్ 2 షూటింగ్ పూర్తి అయినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. దీంతో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. అయితే గురువారం నాడు విడుదల చేసిన పిక్ లో మాత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తప్ప ఎన్టీఆర్ ఎక్కడా కనపడలేదు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.