Telugu Gateway
Cinema

రామ్ తోనే భీమ్ కు ప‌రిపూర్ణ‌త‌

రామ్ తోనే భీమ్ కు ప‌రిపూర్ణ‌త‌
X

ఆర్ఆర్ఆర్ సినిమా ఫ‌లితంపై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తం అవుతున్నా వ‌సూళ్ల ప‌రంగా మాత్రం ఆశాజ‌న‌క ఫ‌లితాలే వ‌స్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉగాదితోపాటు వ‌ర‌స సెల‌వులు ఉండ‌టంతో మ‌రో నాలుగైదు రోజులు పాట వ‌సూళ్ళు ప్రోత్సాహ‌క‌రంగా ఉంటాయ‌నే చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ త‌రుణంలో సినిమా విజ‌య‌వంతంపై ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లేఖ విడుద‌లు చేశారు. అందులో ఆయ‌న ఈ సినిమా కోసం ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. ఈ లేఖ‌లో రామ్‌ చరణ్‌ని పొగడ్తలతో ముంచేశాడు తారక్‌. అల్లూరి పాత్రని చరణ్‌ కంటే ఇంకా ఎవరు బెటర్‌గా చేయలేరని అభిప్రాయపడ్డాడు. చెర్రీ లేకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ని ఊహించుకోవడం కష్టమని తారక్‌ అన్నాడు.

అల్లూరి పాత్రతోనే భీమ్‌ పాత్రకు పరిపూర్ణత చేకూరిందన్నాడు. తనలోని గొప్ప నటుడిని వెలికితీసిన రాజమౌకి ధన్యవాదాలు తెలిపాడు. హీరోయిన్‌ ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య, సాంకెతిక నిపుణులు, మీడియాకి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక లేఖ చివర్లో తన అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పాడు. తనపై చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. ఇంకా ఎన్నో మంచి సినిమాలతో అలరిస్తానని తన అభిమానులకు హామీ ఇచ్చాడు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం.. మూడు రోజల్లోనే .500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి రికార్డుని తిరగరాసింది.

Next Story
Share it