Telugu Gateway
Cinema

త్వరలోనే షూటింగ్ స్టార్ట్

త్వరలోనే షూటింగ్ స్టార్ట్
X

టాలీవుడ్ లో ఊహించని కాంబినేషన్ సడన్ గా బయటకు వచ్చింది. ఎక్కడా కనీసం చర్చ కూడా లేకుండా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుంది అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది ఇప్పుడు అటు టాలీవుడ్ తో పాటు ఎన్టీఆర్ ఫాన్స్ లో కూడా ఆసక్తికర చర్చకు కారణం అయింది. దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. మరో వైపు ఎన్టీఆర్ ఒక వైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఈ తరుణంలో వీళ్లిద్దరి కాంబినేషన్ ను ఎవరూ ఊహించలేదు. కానీ శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా అటు ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కొత్త సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి గాడ్ ఆఫ్ వార్ సినిమా కూడా చేయనున్నాడు.

అయితే ఇప్పుడు కొత్తగా ప్రకటించిన అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ సినిమా ముందు స్టార్ట్ అవుతుందా...లేక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమానా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తాడు. అది కూడా బడ్జెట్ పరిధిలోపే పూర్తి చేస్తాడు అన్న పేరు కూడా ఉంది. తమ కాంబినేషన్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది అని ...ఫుల్ ఎంటర్టైనర్ రానుంది అంటూ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది అని కూడా వెల్లడించారు. దర్శకుడు అనిల్ రవిపూడి ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ లతో తెరకెక్కిస్తున్న సినిమా వచ్చే సంక్రాంతికి రానుంది. ఈ సినిమా టైటిల్ జనవరి 12 న విడుదలగా ఫిక్స్ చేశారు.

Next Story
Share it