యాంకర్ సుమ, ఫాన్స్ పై ఫైర్ అయిన ఎన్టీఆర్

తర్వాత ఫాన్స్ ను అనునయిస్తూనే అదిరిపోయే అప్ డేట్స్ ఉంటే తామే తప్పకుండ చెపుతాం అని..ఇంట్లో మా భార్య కంటే ముందు మీతోనే షేర్ చేసుకుంటాం అంటూ ఎన్టీఆర్ కీలక వ్యాఖలు చేశారు. ఏదో తొందరపడి ఒక ప్రకటన చేస్తే మళ్ళీ మీరే విమర్శలు చేస్తారు...దీంతో నిర్మాతలు, దర్శకులు ఒత్తిడికి లోనవుతారు అంటూ ఎన్టీఆర్ కీలక వ్యాఖలు చేశారు. ఇది తన ఒక్కడి సమస్య కాదు అని..పరిశ్రమలోని ఇతర నటులు...హీరో లు అందరిదీ ఇదే పరిస్థితి అంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశారు. తన కొత్త సినిమా ఫిబ్రవరి లో స్టార్ట్ అయి..మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అని....సినిమా విడుదల 2024 ఏప్రిల్ 5 న ఉంటుంది అని ప్రకటించారు. వాస్తవానికి ఈ వివరాలు అన్ని చిత్ర యూనిట్ గతంలో చెప్పినవే ...అప్పటిలోనే సినిమా రిలీజ్ కు ఇంత గ్యాప్ పెట్టడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా లో దర్శకుడు కొరటాల శివ ను తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ ఇలా మాట్లాడి ఉంటారు అనే చర్చ సాగుతోంది.