Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ ఫొటోస్ వైరల్

ఎన్టీఆర్ ఫొటోస్ వైరల్
X

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఒక వైపు దేవర సినిమా షూటింగ్ లో పాల్గొంటూ...మరో వైపు బాలీవుడ్ మూవీ వార్ 2 లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏ మాత్రం గ్యాప్ లేకుండా రెండు సినిమాల షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తర్వాత సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అయితే ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేని రీతిలో తన వెంటపడుతున్న ఫోటో గ్రాఫర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ముంబై లో ఎన్టీఆర్ ఫోన్ మాట్లాడుతూ ఒక హోటల్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్స్ వెంటపడగా..ఆయన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనబడనున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. తొలి భాగం దసరా కు అంటే అక్టోబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దేవర సినిమా తోనే బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it