Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ ..ఫాన్స్ నిరాశ

ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ ..ఫాన్స్ నిరాశ
X

కొత్త ఏడాది కొత్త సినిమాల అప్ డేట్స్ ఇస్తే ఆయా హీరోల ఫాన్స్ హ్యాపీ. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం కొత్త అప్డేట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాదిగా ప్రకటించటమే దీనికి కారణం. ఈ అంశంపై వాళ్ళు ఏ మాత్రం మొహమాటం లేకుండా సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు ఎన్టీఆర్ హీరో గా అయన 30 వ సినిమా ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి లో ప్రారంభం అవుతుందని తాజా అప్ డేట్ లో తెలిపారు. అప్పుడే విడుదల తేదీ కూడా ప్రకటించారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5 న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా విడుదలకు ఇంత గ్యాప్ పెట్టడంపై ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత లేట్ ఎందుకు అని కొంత మంది...ఇదే ప్లానింగ్ అంటూ మరికొంత మంది తప్పుపడుతున్నారు.

కనీసం ఇప్పటికైనా ప్రకటించారు సంతోషం అంటూ మరి కొంత మంది స్పందించారు. జనతా గ్యారేజ్ ఏడు నెలల్లోనే పూర్తి చేశారుగా అని మరో అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్, మరో హీరో రామ్ చరణ్ తో కలిసి నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ గత ఏడాది విడుదల అయి సంచలన విజయం నమోదు చేసుకుంది. అయితే కొరటాల ఒక సినిమా పూర్తి చేయటానికి ఇంత ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ మరి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఇదే ప్రాజెక్ట్ పై ఉంటారా..లేక మధ్యలో ఇంకా ఏమైనా ప్రాజెక్టులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Next Story
Share it