Telugu Gateway
Cinema

దేవరలో కొత్త హీరోయిన్

దేవరలో కొత్త హీరోయిన్
X

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా కు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా మరాఠీ నటి ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ తో పాటు మరాఠి నటి శృతి మరాఠే నటించనున్నట్లు స్పష్టం అయింది. దేవరలో ఆయనకు భార్యగా కనిపిస్తా అని ఆమె వెల్లడించింది. అంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేయనున్నట్లు కూడా తేలిపోయింది.

రెండు భాగాలుగా రానున్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవా లో సాగుతోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 5 న విడుదల చేయాలని నిర్ణయించి వివిధ కారణాలతో తర్వాత వాయిదా వేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. దేశ వ్యాప్త మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే ఇందులో అత్యంత కీలకమైన విలన్ పాత్రకు బాలీవుడ్ కు చెందిన సైఫ్ అలీ ఖాన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it