Telugu Gateway
Cinema

దేవర విడుదల తేదీ మారింది (Devara New Release date)

దేవర విడుదల తేదీ మారింది (Devara New Release date)
X

ప్రచారమే నిజం అయింది. ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ ఐదు నుంచి విడుదల తేదీ ఏకంగా అక్టోబర్ పదికి మారింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం నాడు అధికారంగా వెల్లడించింది. దీనికి సంబంధించి కొత్త లుక్ తో ఈ విషయాన్నివెల్లడించారు. దసరా టార్గెట్ గా సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. దేవర సినిమాలో విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ప్రమాదానికి గురవడంతో పాటు విఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం వంటి అంశాలు కూడా దేవర వాయిదాకు కారణం అయ్యాయి అని చెపుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించి యాక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర లో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఏప్రిల్ ఐదు విడుదల తేదిపైనే అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దర్శకుడు కొరటాల శివ పై విమర్శలు గుప్పించారు. అలాంటిది ఇప్పుడు సినిమా ఏకంగా అక్టోబర్ పదికి మారటం ఖచ్చితంగా ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసే అంశమే అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావటంతో దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.



Next Story
Share it