Telugu Gateway
Cinema

ఓలివాకు బర్త్ డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్

ఓలివాకు బర్త్ డే విషెస్ చెప్పిన  ఎన్టీఆర్
X

రాజమౌళి ధర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో హాలీవుడ్ నటి ఓలివా మోరిస్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందో సినిమా విడుదల అయితే కానీ తెలియదు. కానీ ఎన్టీఆర్ జనవరి 29న తన హీరోయిన్ ఓలివా పుట్టిన రోజు కావటంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.

ఎన్టీఆర్ తోపాటు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ అంతా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వెండితెరపై మీ జంట ఎంత బాగుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తునన్నట్లు పోస్టులు పెడుతున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Next Story
Share it