Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమం డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమం డేట్ ఫిక్స్
X

వాయిదా పడిన ఎన్టీఆర్ 30 వ సినిమా పూజా కార్యక్రమం మార్చి 18 న జరగనుంది. వాస్తవానికి ఇది ఫిబ్రవరి 24 నే జరగాల్సి ఉన్నా నందమూరి తారకరత్న మృతి తో ఇది వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అన్నీ ఫిక్స్ అయ్యాయి. ఈ ఆర్ఆర్ఆర్ హీరో మార్చి ఆరు తెల్లవారు జామున అమెరికా బయలుదేరి వెళుతున్నారు. అక్కడ మార్చి 12 న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్కార్ వేదికపై నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాట పాడే అవకాశం అకాడమీ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కు ఇచ్చింది అంటే ఈ పాటకు అవార్డు పక్కా అనే ధీమా లో చిత్ర యూనిట్ ఉంది.

ఎన్టీఆర్ తిరిగి మార్చి 15 న ఇండియా కు వస్తారు. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూజా కార్యక్రమం జరగనుంది అని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆర్ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే. ఈ సినిమా కూడా తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఈ సినిమా విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేశారు.

Next Story
Share it