Telugu Gateway
Cinema

ఎన్టీఆర్..కొరటాల శివ కొత్త సినిమా

ఎన్టీఆర్..కొరటాల శివ కొత్త సినిమా
X

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయింది. తారక్ 30వ సినిమాను సోమవారం నాడు ప్రకటించారు. కొరటాల శివ, ఎన్టీఆర్ లు కలసి చేసిన 'జనతాగ్యారేజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రకటించిన కొత్త సినిమాపై క్రేజ్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. జూన్ రెండవ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇప్పుడే ప్రకటించారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు నిర్మాతలు గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉండగా, దర్శకుడు కొరటాల శివ కూడా ఆచార్య సినిమా ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. అందుకే కొత్త సినిమా షూటింగ్ కు జూన్ ను ముహుర్తంగా ఎంచుకున్నారు.

Next Story
Share it