Telugu Gateway
Cinema

అట్టహాసంగా ఎన్టీఆర్ కొత్త సినిమా షురూ

అట్టహాసంగా ఎన్టీఆర్ కొత్త సినిమా షురూ
X

జై లవ కుశ సినిమాలో జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ప్రేక్షకులను నిజం గానే భయపెట్టారు. ఈ సినిమాలో అయన పోషించిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఎంత హైలైట్ అయిందో అందరికి తెలిసిందే. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరంభీముడొ సాంగ్ లో ఎన్టీఆర్ నటన అయితే అసాధారం అని చెప్పుకోవాలి. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటారా?. భయం అంటే ఏంటో తెలియని వాళ్లకు ఎన్టీఆర్ దాన్ని రుచి చూపిస్తారంట. అంటే ఇక అయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పటం తో ఎన్టీఆర్ 30 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. తీరప్రాంత బ్యాక్ డ్రాప్ లో దేవుడు, చావు అంటే కూడా భయం లేని వాళ్ళతో ఎన్టీఆర్ మరి ఎలా డీల్ చేస్తారో చూడాలి.

తన కెరీర్ లో ఇది బెస్ట్ సినిమా అవుతుంది అని మాట ఇస్తున్నా అన్నారు దర్సకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన దిగ్గజ దర్శకులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభం అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావటం తో దీనిపై ఎన్టీఆర్ ఫాన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఎస్ ఎస్ రాజమౌళి తో పాటు...ప్రశాంత్ నీల్, టాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు.

Next Story
Share it