Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కొత్త సినిమా పూజ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ కొత్త సినిమా పూజ డేట్ ఫిక్స్
X

ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఇటీవలే చిత్ర యూనిట్ ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె , బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ముహూర్తపు షాట్..పూజ కార్యక్రమం మార్చి 23 న జరగనుంది అని ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఈ సినిమా విడుదల కానుంది. వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం.

Next Story
Share it