Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్

ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్
X

ప్రచారమే నిజం అయింది. ఎన్టీఆర్ 30 సినిమాలో బాలీవుడ్ కు చెందిన కీలక నటుడు సైఫ్ అలీఖాన్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ లతో కూడిన ఫోటో లు విడుదల చేస్తూ జాతీయ అవార్డు నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా షూట్ లో భాగస్వాములు అయ్యారని తెలిపింది.ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను తీసుకున్న విషయం తెలిసిందే.

జాన్వీ కి ఇదే తొలి తెలుగు సినిమా. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 మూవీ లో హాలీవుడ్ కు చెందిన పలువురు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటున్నారు. దీంతో ఈ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ప్రభాస్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా లో కూడా ఆయన్నే తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it