Telugu Gateway
Cinema

'నూటొక్క జిల్లాల అంద‌గాడు' ట్రైల‌ర్ విడుద‌ల‌

నూటొక్క జిల్లాల అంద‌గాడు ట్రైల‌ర్ విడుద‌ల‌
X

యువ‌త‌కు ఇప్పుడు జ‌ట్టు ఓ ప్ర‌ధాన స‌మ‌స్య‌. పెళ్లి కాని కుర్రాళ్ల‌కు కూడా నెత్తి మీద జుట్టు ఉండ‌టం లేదు. దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాలు.. అదే ఓ పెద్ద స‌మ‌స్య అయి కూర్చుంటుంది. జుట్టు లేక‌పోతే పెళ్ళి కూడా కాని ప‌రిస్థితులు. ఇదే స‌మ‌స్య‌ను సీరియ‌స్ గా తీసుకుని తెరకెక్కించిన సినిమానే 'నూటొక్క జిల్లాల అంద‌గాడు'. ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

' ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెన‌ల‌కు ప‌ళ్ళు రాల‌తాయ‌ని భ‌య‌మేస్తుందో. ఏ జుట్టు ముడేస్తే కొండ‌లు సైతం క‌దులుతాయో. అటువంటి బ‌ల‌మైన‌, ద‌ట్ట‌మైన జుట్టు ఇచ్చి ఈ కేశ దారిద్ర్యం నుంచి బ‌య‌ట‌ప‌డేసి..ఈ క్షవ‌ర సాగ‌రం దాటించుస్వామి అంటూ అవ‌స‌రాల శ్రీనివాస్ ట్రైల‌ర్ చివ‌రిలో చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

Next Story
Share it