ఎత్తిపడేసిన నివేదా థామస్
BY Admin8 Sept 2021 3:35 PM IST

X
Admin8 Sept 2021 3:35 PM IST
హీరోయిన్లు అంటే ఎక్కువ శాతం పాటలు..ప్రేమలు. మెజారిటీ సినిమాల్లో వీరి పాత్రలు అలాగే పరిమితం అవుతాయి. అయితే అక్కడక్కడ హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా ఫైట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటారా?. హీరోయిన్ నివేదా థామస్ తనలోని కొత్త కోణాన్ని చూపించారు. సరదాగా తనతో బాక్సింగ్ చేయటానికి వచ్చిన వ్యక్తిని ఏకంగా ఎత్తి అవతల పడేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను నివేదా థామస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అంతే కాదు..ఈ వీడియో తయారీలో మనుషులకు ఎలాంటి హాని చేయలేదంటూ దానికింద రాశారు. అందులోనూ చాలా పొట్టిగా ఉండే నివేదా థామస్ ఈ ఫీట్ చేయటం విశేషం.
Next Story