నితిన్ కొత్త సినిమా ఓటిటి లోకి

బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిన దిల్ రాజు సినిమా తమ్ముడు. ఈ సినిమా హీరో నితిన్ తమ్ముడు మూవీ తో తిరిగి ఖచ్చితంగా గాడిన పడతాను అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పినా కూడా అదేమీ వర్క్ అవుట్ కాలేదు. గతంలో చేసిన తప్పులు ఇక చేయను అని... తన నుంచి ఇక మంచి సినిమాలే వస్తాయని తమ్ముడు మూవీ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది. అంతే కాదు...నితిన్ భవిష్యత్ సినిమా లపై కూడా ఇది ప్రభావం చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చవి చూసిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది.
ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది అని ప్రకటించారు. తమ్ముడు సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కగా... సీనియర్ నటి లయ ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి ఆజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఫీమేల్ లీడ్స్ లో నటించారు. ఈ మొత్తం సినిమాలో కాస్త వెరైటీ గా ఉన్నది అంటే సౌరభ్ సచ్ దేవ పోషించిన విలన్ పాత్ర ఒక్కటే అని చెప్పొచ్చు.



