హాట్ స్టార్ లో 'మాస్ట్రో' ..సెప్టెంబర్ 17న
BY Admin28 Aug 2021 7:20 PM IST
X
Admin28 Aug 2021 7:20 PM IST
నితిన్, నభా నటేష్ లు జంటగా నటించిన చిత్రమే 'మాస్ట్రో'. ఈ సినిమాలో నితిన్ అంధుడుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో రవితేజ అంధుడిగా నటించిన సినిమా రాజా ది గ్రేట్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరి నితిన్ చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమా హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
సెప్టెంబర్ 17 నుంచి సినిమా స్ట్రీమ్ అవుతుందని కొత్త పోస్టర్ విడుదల చేసి వెల్లడించారు. మాస్ట్రోలో తమన్నా కూడా కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇది హీరో నితిన్ ఇది 30వ చిత్రం. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదున్ కు రీమేక్ గా ఈ సినిమాను నిర్మించారు.
Next Story