ఈ సారి అయినా ట్రాక్ లోకి వస్తాడా!

నితిన్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ హీరో గత సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. ఆయన రీసెంట్ సినిమాలు రాబిన్ హుడ్, తమ్ముడు లు ఎంత డిజాస్టర్ గా మారాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నితిన్ మరో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా నితిన్ కు దక్కింది. ఈ సినిమాను ప్రముఖ హీరో నాని సమర్పిస్తుండటం విశేషం. ఒక వైపు హీరో గా బిజీ గా ఉన్న నాని..పలు సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నాని సమర్పణలో రానున్న ఈ నితిన్ కొత్త సినిమాకు ‘అలియాస్ రుక్మిణీ’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు.



