నితిన్, నభా నటేష్ లు జంటగా నటించిన చిత్రం 'మాస్ట్రో'. ఈ సినిమా ఆగస్టు 15న ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి 'వెన్నెల్లో ఆడిపిల్ల..' అనే లిరిక్స్‌తో సాగే పాటను చిత్రయూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఇది నితిన్ కు 30వ సినిమా. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదల అయిన ఈ మెలోడీ సాంగ్‌కు శ్రీజో, కృష్ణ చైతన్య ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమా తమన్నా కూడా ఓ కీలకపాత్ర పోషించింది.