రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా సంయుక్త మీనన్, నభా నటేష్ లు నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. భారీ భారీ సెట్టింగ్ లు...యాక్షన్ సన్నివేశాలు ..యోధుడిగా నిఖిల్ లుక్స్ అన్నీ కలిపి సినిమాపై అంచనాలు పెంచాయనే చెప్పాలి. ఈ సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ 2026, ఏప్రిల్ 10న ఉండే అవకాశం ఉంది చెపుతున్నారు. ‘స్వయంభు’ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని హీరో నిఖిల్ అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీ ని భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెత్‌తో ఈ సినిమాను విజువల్ వండర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను గ్రాండియర్‌గా చూపెట్టనుంది. ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ కు మరో భారీ హిట్ పడలేదు. ఆ తర్వాత విడుదల అయిన 18 పేజెస్ మూవీ ఒక మోస్తరుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత విడుదల అయిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చవిచూశాయి. దీంతో ఈ హీరో ఇప్పుడు స్వయంభు మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.



