Telugu Gateway
Cinema

నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్

నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్
X

నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్ కు డిసైడ్ అయ్యారు. అయితే ఇది ఎక్కడ అన్నది నిర్ణయించే బాద్యతను హీరో వరుణ్ తేజ్ కు అప్పగించినట్లు నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి సంబంధించి పలు ప్రాంతాలను ఎంపిక చేశామని..త్వరలోనే ప్లేస్ ఫిక్స్ చేస్తామన్నారు. డిసెంబర్ లో ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని నాగబాబు తెలిపారు. కరోనా కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలోనే నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా ఆగష్టు 13న ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌-ఉపాసన, అల్లు అర్జున్‌- స్నేహ, సాయిధరమ్‌తోపాటు కుటుంబ సభ్యులు హాజరైన విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ జె ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది.

Next Story
Share it