Telugu Gateway
Cinema

చిరు, దిల్ రాజు "ముందు చూపు"

చిరు, దిల్ రాజు ముందు చూపు
X

టాలీవుడ్ కు సంక్రాంతి ఎంత స్పెషలో అందరికి తెలిసిందే. ప్రతి సారి సంక్రాంతి సందర్భంగా సినిమాల పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ సంక్రాంతికి కూడా అదే జరిగింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి పండగ ముగిసి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే వచ్చే సంక్రాంతి అంటే...2025 సంక్రాంతి రేస్ కు ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ లు స్టార్ట్ అయ్యాయి. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా మీడియా తో మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి బరిలో తమ బ్యానర్ సినిమా ఉంటుంది అని ఇప్పటికే ప్రకటించారు. అది శత మానం భవతి సీక్వెలా ...లేక మరొక సినిమానా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. శుక్రవారం నాడు వచ్చే సంక్రాంతి రేస్ నిలవబోతున్నట్లు మరో కీలక ప్రకటన వెలువడింది. అది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా. ఈ సినిమాను 2025 జనవరి 10 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు న్యూ లుక్ ను కూడా విడుదల చేసింది. అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్ అవతరిస్తారు అంటూ ఒక లుక్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తుంటే...యూవి క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబదించిన వీడియోను కూడా తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. విశ్వంభర చిరంజీవి 156 వ సినిమా. చిత్ర యూనిట్ తాజా ప్రకటనతో వచ్చే సంక్రాంతికి ఇప్పుడే రెండు సినిమా లు స్లాట్స్ బుక్ చేసుకున్నట్లు అయింది. మరి పండగ వచ్చే నాటికీ రేస్ లోకి ఇంకెన్ని వస్తాయో చూడాలి. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రవి తేజ ఈగల్ వెనక్కి తగ్గటంతోనే ఈ సంఖ్య నాలుగు సినిమాలకు పరిమితం అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరో గా నటించిన గుంటూరు కారం..చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం దక్కించుకున్న హను మాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it