Telugu Gateway
Cinema

సంక్రాంతి వసూళ్ల పంచాయతీలో ఇదో కొత్త కోణం

సంక్రాంతి వసూళ్ల పంచాయతీలో ఇదో కొత్త కోణం
X

సంక్రాంతి సినిమాల వసూళ్ల పంచాయతీలో ఇదో కొత్త కోణం. ఇప్పడు సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ హల్చల్ చేస్తోంది. యాక్టింగ్ కు కేర్ అఫ్ అడ్రస్ నందమూరి ఫామిలీ అంటూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇందులో ఒకటి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం బీముడో పాటలోనిది అయితే...రెండవది వీరసింహారెడ్డి సినిమాలో టైటిల్ రోల్ పోషించిన బాలకృష్ణ హత్య సన్నివేశంలోనిది. నిజంగా బాలకృష్ణ ఆ సన్నివేశంలో కనపర్చిన నటన ఆకట్టుకున్నది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నిజంగా ఎన్టీఆర్ పాత్ర గురించి మాట్లాడుకోవాలి అంటే అవార్డు వచ్చిన నాటు నాటు సాంగ్ కంటే కొమరం బీముడో పాటలో ఎన్టీఆర్ నటనే అల్టిమేట్ అని చెప్పక తప్పదు. గ్రాఫిక్స్ అయినా కూడా ఒక వాహనం నుంచి జంతువులతో ఎన్టీఆర్ దిగే సన్నివేశాలు కూడా సినిమాలో ఎక్కువమందిని ఆకట్టుకున్న సీన్ అదే.

ఇక వీరసింహారెడ్డిలో పెద్దయ్య పాత్రలో కనిపించిన బాలకృష్ణ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సంక్రాంత్రి సినిమాల వసూళ్ల విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి కంటే చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ముందు ఉంది. దీంతో బాలకృష్ణ అభిమానులు చర్చను ఇటు వైపు మళ్లిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు హాట్ డిస్కషన్ కు కారణం అవుతోంది. తాజాగా బయటకు వచ్చిన లెక్కల ప్రకారం వాల్తేర్ వీరయ్య కు ఐదు రోజులకు గాను 144 .15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాగా, వీరసింహారెడ్డి కి ఆరు రోజులకు గాను 109 .40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.



Next Story
Share it