Telugu Gateway
Cinema

జులై 30 నుంచి థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు

జులై 30 నుంచి థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు
X

కొత్త సినిమాల సంద‌డి ప్రారంభం కాబోతుంది. థియేట‌ర్ల ప్రారంభించ‌టానికి ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇచ్చినా కొత్త సినిమాలు ఏవీ విడుద‌ల‌కు సిద్ధంగా లేక‌పోవ‌టం..ఎంత మేర ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌నే సందేహ‌ల‌తో ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ముందుకు రాలేదు. అయితే తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సింగిల్ థియేట‌ర్ల‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవ‌టానికి కూడా అనుమ‌తి ఇచ్చింది. అదే స‌మ‌యంలో వంద శాతం అక్యుపెన్సీతో థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఏపీలో మాత్రం 50 శాతం మాత్ర‌మే అని చెబుతున్నారు. అయితే తాజాగా జులై 30న విడుద‌ల అయ్యేందుకు రెండు సినిమాలు సిద్ధం అయ్యాయి.

అందులో ఒక‌టి తేజా స‌జ్జ ఇష్క్ మూవీ కాగా..రెండ‌వ‌ది స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన‌న తిమ్మ‌రుసు. ఇష్క్ సినిమాకు సంబంధించి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. 'ఆనందమా.. ఆనందమదికే'అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి శ్రీమణి లిరిక్స్‌ అందించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. ఇదిలా ఉంటే తిమ్మ‌ర‌సు సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని జులై30న‌న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Next Story
Share it