Telugu Gateway
Cinema

డ్రగ్స్ కేసులో అన‌న్య‌పాండే పేరు..షారుఖ్ ఇంట్లోనూ సోదాలు

డ్రగ్స్ కేసులో అన‌న్య‌పాండే పేరు..షారుఖ్ ఇంట్లోనూ సోదాలు
X

అర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు కొత్త మ‌లుపు తిరిగింది. ఈ వ్య‌వ‌హారంలో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అధికారులు హీరోయిన్ అన‌న్య‌పాండేకు నోటీసులు ఇచ్చారు.. విచార‌ణ‌కు రావాల్సిందిగా ఆదేశించారు. గురువారం నాడు ఆమె నివాసంలో అధికారులు సోదాలు నిర్వ‌హించారు. అన‌న్య‌పాండే తోపాటు షారుఖ్ ఖాన్ ఇంట్లోనూ ఎన్ సీబీ అధికారులు సోదాలు జ‌రిపారు. ఇప్ప‌టికే షారుఖ్ త‌న‌యుడు అర్య‌న్ ఖాన్ క్రూయిజ్ లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీలో ఉన్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఎన్ సీబీ అధికారులు..అర్య‌న్ ఖాన్, అన‌న్య‌పాండే వాట్స‌ప్ చాట్ లో డ్ర‌గ్స్ కు సంబంధించిన చ‌ర్చ‌లు ఉన్నాయంటూగా తాజాగా కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మ‌రుస‌టి రోజే ఆమె ఇంట్లో సోదాలు చేయ‌టం..నోటీసులు ఇవ్వ‌టం ప్రాధాన్యత సంత‌రించుకుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు అర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా కోర్టు నిరాక‌రించింది. తాజాగా ముంబ‌య్ హైకోర్టులో బెయిల్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఇప్పుడు కొత్త‌గా అన‌న్య‌పాండే తెర‌పైకి రావ‌టంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ బాలీవుడ్ హీరోయిన్ ప్ర‌స్తుతం విజ‌య‌దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి లైగ‌ర్ సినిమాలో న‌టిస్తోంది.

Next Story
Share it