Telugu Gateway
Cinema

చిరు..బాలకృష్ణ ఫైట్ మిస్

చిరు..బాలకృష్ణ ఫైట్ మిస్
X

నందమూరి బాలకృష్ణ మరి సారి సంక్రాంతి బరిలోకి దిగనున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన 109 వ సినిమా 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. దసరా సందర్భంగా ఈ అప్ డేట్ ఇస్తూ దీపావళికి టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. 2023 సంక్రాంతికి విడుదల అయిన వీరసింహ రెడ్డి మంచి హిట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి వచ్చే సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర విడుదల కావాల్సి ఉన్నా.. గేమ్ ఛేంజర్ సినిమా కోసం విడుదల తేదీని మార్చుకున్నారు.

లేదంటే మరో సారి 2025 సంక్రాంతి బరిలో ఒక వైపు బాలకృష్ణ, మరో వైపు చిరంజీవి సినిమాలు ఉండేవి. అయితే ఈ సారి చిరంజీవి బదులు ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలవనుంది. విశ్వంభర విడుదల కోసం లాక్ చేసిన జనవరి 10 నే గేమ్ ఛేంజర్ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఎన్ బికె 109 లో విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ కు జోడిగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది.

Next Story
Share it