Telugu Gateway
Cinema

బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్

బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్
X

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎన్ బీకె 108 సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ బుధవారం నాడు అప్డేట్ ఇచ్చింది. అదేంటి అంటే ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయితే...శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీరసింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా ఇదే కావటం, అనిల్ రావిపూడి , బాలకృష్ణ కాంబినేషన్ మొదటిసారి కావటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో తొలిసారి తెలంగాణ కథతో బాల కృష్ణ సినిమా చేస్తున్నట్లు అనిల్ రావిపూడి ఒక సారి వెల్లడించారు గతం లో బాలకృష్ణ ఎక్కువగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it