Telugu Gateway
Cinema

బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మి

బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మి
X

బాలకృష్ణ సినిమాకు సంబంధించిన కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సంస్థ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌కు ప్ర‌ముఖ న‌టి వరలక్ష్మిని ఎంపిక చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా బాల‌కృష్ణకు 107వ సినిమా. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు వరలక్ష్మి పాత్ర‌కు సంబంధించిన విష‌యాన్ని వెల్ల‌డించారు. వరలక్ష్మి టాలీవుడ్ లో విభిన్న పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుని త‌న‌దైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు బాల‌కృష్ణ సినిమాలో వ‌ర‌లక్ష్మి ఎంట్రీ ఖ‌రారు అవ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయ‌ని చెప్పొచ్చు.

Next Story
Share it