Telugu Gateway
Cinema

బాలకృష్ణ కొత్త సినిమా ముహుర్తం ఖ‌రారు

బాలకృష్ణ కొత్త సినిమా ముహుర్తం ఖ‌రారు
X

గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాలకృష్ణ కొత్త సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అదే ఎన్ బికె 107. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. న‌వంబ‌ర్ 13న ఉద‌యం 10.26 నిమిషాల‌కు ఈ సినిమా ముహుర్తపు పూజ ప్రారంభం కానుంద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ న‌టిస్తుండ‌గా.. ఈ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

వేట త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది అంటూ చిత్ర యూనిట్ ఈ ముహుర్త‌పు లుక్ ను విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే బాలకృష్ణ న‌టించిన అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్ర‌గ్యా జైస్వాల్ న‌టించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it