Telugu Gateway
Cinema

నా జీవో అంటే గాడ్స్ ఆర్డ‌ర్

నా జీవో అంటే గాడ్స్ ఆర్డ‌ర్
X

అదే స్టైల్. అదే ప‌వ‌ర్ ఫుల్ యాక్షన్. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లు. ఎన్ బికె 107 టీజ‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో బాల‌య్య‌కు జోడీగా శృతి హాసన్ న‌ట‌స్తుంటే..వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీలక‌ పాత్ర‌లో నటించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను గురువారం సాయంత్రం విడుద‌ల చేశారు. ఇందులో బాల‌య్య ..మీ జీవో గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్..నా జీవో గాడ్స్ ఆర్డ‌ర్ అంటూ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. భ‌యం నా బయోడేటాలోనే లేదురా బోస‌డికే..న‌ర‌క‌టం మొద‌లుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాల‌కు కూడా తెలియ‌దు అంటూ బాల‌క్రిష్ణ అభిమానులు కోరుకునే డైలాగ్ ల‌తో ఫ‌స్ట్ హంట్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

Next Story
Share it